వృత్తి కులాలకు లక్షసాయం చారిత్రాత్మకం

వృత్తి కులాలకు లక్షసాయం చారిత్రాత్మకం
  • కుల వృత్తులకు జీవంపోసింది కేసీఆరే
  • వృత్తి కులాల ఆర్ధిక అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం 
  • మేదరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
  • కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సహన్ని సధ్వినియోగం చేసుకోవాలి
  • సూర్యాపేట లో రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన సూర్యాపేట జిల్లా  మేధర సంఘం ప్రతినిధులు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: వృత్తి కులాలకు లక్ష సాయం చేయాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా వృత్తి కులాలన్నింటికీ రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం నిర్ణయాన్ని హర్షిస్తూ సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన సూర్యాపేట జిల్లా మేదర సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతించడంతోపాటు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వృత్తుల వికాసానికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని, కుల సంఘాల నేతలు విశ్వాసం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 కు ముందు అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్‌  నే అన్నారు.

కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో  భాగంగానే వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిందని చెప్పారు. దీన్ని ప్రతి ఒకరూ వినియోగించుకోవాలని కోరారు.మేదరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి,
కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సహం తో మేదర సోదరులు వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకుని ఆర్దికంగా వృద్ది చెందాలి  అని మంత్రి ఆకాంక్షించారు.

ఇప్పటికే మేదరులకు వెదురుతో గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పించిందన్నారు .కొద్ది మందికి రుణాలను కూడా మంజూరు చేసిందన్న  మంత్రి,అదేరీతిన మిగతా కులవృత్తుల అభ్యున్నతికి కూడా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నదన్నారు.కార్యక్రమం లో బీఆర్ఎస్ రాష్ట్ర  కార్యదర్శి వై. వీ, మేదార సంఘం ప్రతినిధులు యాదగిరి, మల్లయ్య, తిరుపతయ్య, వెంకన్న, మల్లేశం, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు..