జిల్లా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి 10 లక్షల నిధులు కేటాయిస్తా...

జిల్లా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి 10 లక్షల నిధులు కేటాయిస్తా...
State Tribal Women and Child Welfare Minister Satyavati Rathore
  •  జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యపై త్వరలోనే ప్రత్యేక సమావేశం
  •  టీయూడబ్ల్యూజే ఐజేయు డైరీని ఆవిష్కరించిన  రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

 ముద్ర మహబూబాబాద్ ప్రతినిధి:  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి తన నిధుల నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుదవారం టీయూడబ్ల్యూజే ఐజేయు 2023 డైరీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం 10 లక్షలరూపాయలు ఇవ్వడంతో పాటు,  జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఉపయోగపడే విధంగా నూతన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలకేటాయింపు అంశంలోనూ తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటి స్థలాలు కేటాయించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు తనను కోరారని,  కచ్చితంగా త్వరలోనే ఈ..అంశంపై  జిల్లా స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల ముందుండి పోరాడుతున్న టియుడబ్ల్యూజే(ఐజేయు)ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.

టీయూడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డైరీఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యవతిరాథోడ్ ను ఘనంగా సన్మానించారు. ఈ..కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండి సంపత్ కుమార్, జిల్లాకోశాధికారి గాడి పెల్లి శ్రీహరి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా కార్యదర్శి రంగా చౌదరి, కోశాధికారి పురుషోత్తం, జిల్లా నాయకులు గుజరాతి రాంప్రసాద్, చందా శ్రీనివాస్, ముఖేష్, మధు, మహేష్, జీవన్, రాము, విక్రం, అశోక్, పూర్ణచందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు