మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి డిసిసి ప్రధానకార్యదర్శి ఎండి మజహార్ 

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి డిసిసి ప్రధానకార్యదర్శి ఎండి మజహార్ 

భువనగిరి జూలై 17 (ముద్ర న్యూస్):- భువనగిరి పట్టణ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి ఎండి మజహార్ మాట్లాడుతూ, కెసిఆర్ పేరుకే గొప్పలు చెప్పుకోవడం తప్ప మైనారిటీలకు చేసింది ఏమీ లేదని అన్ని వాగ్దానాల్లో విఫలమయ్యాడని,  మరి ఆనాడు ఎలక్షన్లలో ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని, మైనార్టీలకు 12% శాతం రిజర్వేషన్లు మరియు వక్ఫ్ బోర్డ్ కి జ్యూడిషల్ పవర్ ఇస్తానన్న కేసీఆర్ ఏది అమలు కాలేదని, అలాగే మసీదుల ఇమామ్  మౌజంలకు  నెలవారి  జీతాలు కూడా  అందడం లేదని, మైనార్టీ లోన్ల విషయంలో పేరుకే తూతూ మంత్రంగా ఇవ్వడం జరిగిందని, ముస్లిం మైనార్టీల విషయంలో  పేరుకే గొప్పలు చెప్పుకోవడం తప్ప అమలుపరచడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని, అలాగే షాది ముబారక్ విషయంలో రెండు సంవత్సరాల వరకు వేచి చూడవలసి వస్తుందని, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయని, మైనారిటీల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, వెంటనే 12% శాతం రిజర్వేషన్లు అమలు  చేయాలని ఇచ్చిన మాటకు కట్టుబడాలని, లేకపోతే కర్ణాటక తరహాలో  తెలంగాణలో కూడా మైనార్టీలు అందరూ ఏకమై, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బుద్ధి చెబుతారని, రాబోయే రోజుల్లో కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా, మైనార్టీల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ రషీద్ హుస్సేన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండి అవేజ్  చిష్టి, మాజీ కోఆప్షన్  మెంబర్ ఎండి ఆబిద్ అలీ,  ఎండి సలావుద్దీన్, ఎండి  ఎజాజ్, తదితరులు పాల్గొన్నారు.