భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమైన గులాబ్ తుఫాన్

భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమైన గులాబ్ తుఫాన్

మరో కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృస్టించనున్న గులాబ్ తుఫాన్.  ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్కు 65 కి. మీ, తెలంగాణలోని భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది. రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.