ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం

ముద్ర. వీపనగండ్ల:-కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారత దేశ స్వాతంత్రం కోసం పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని, గాంధీ నెహ్రూ నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించి ఆంగ్లేలను తరము కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు.దేశంలో 49 ఏళ్ల అధికారంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందించిందని ప్రజలకు వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకుంటుండగా తల్లుల కడుపుకోతను చూడలేక తల్లి సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.వచ్చిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనుడు కెసిఆర్ అని విమర్శించారు.

రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, తల్లి సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. నేటి నుంచి జనవరి 6 వరకు గ్రామాలలో ప్రజల వద్దకే ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి అభయాసం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతుందని తెలిపారు.గ్రామాలలో ప్రతిపక్ష నాయకులు రైతు భరోసా పథకం పై దృశ్య ప్రచారం చేస్తున్నారని, కొంత ఆలస్యమైనా రైతులకు రైతు బంధు పథకం డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని, రైతులు ఎలాంటి బెంగ పడాల్సిన అవసరం లేదని అన్నారు, బరాస పార్టీ నాయకులు అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, పానగల్ సింగల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఏత్తం కృష్ణయ్య, నారాయణరెడ్డి, మండల రైతు కిసాన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్క విష్ణు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు సుకన్య రెడ్డి, నాయకులు సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నరసింహ, లోడుగు రాజు, రాంబాబు,వేంకటేశ్వర్ రెడ్డి,శేఖర్తదితరులు ఉన్నారు.