15వ రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర

15వ రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 వ తేదీ శనివారం రోజున రజకుల కుల దైవం ఐన శ్రీ మడెలయ్య స్వామి భోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని రజక సంఘం అధ్యక్షుడు పారిపెళ్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఏడాది కులదైవంకు భోనాలు (నైవేద్యం) సమర్పించి మొక్కులు చెల్లించడం అనావాయితిగా వస్తుందన్నారు.ఈ భోనాల జాతరకు ముఖ్య అథితులుగా మంచిర్యాల ఎంఎల్ఎ నడిపెళ్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య. వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ , కౌన్సిలర్  నల్ల శంకర్ హాజరవుతారని తెలిపారు.  ఈ భోనాలు పట్టణంలోని స్థానిక విశ్వనాధ ఆలయ కాలక్షేప మండపం నుండి ఉదయం 10 గం, లకు ప్రారంభమై కట్ట పోచమ్మ ఆలయం సమీపంలోని శ్రీ మడెలయ  స్వామి ఆలయం వరకు శోభయాత్ర జరుగుతుందని చెప్పారు.  కావున పట్టణంలోని రజకులందరూ పెద్ద  సంఖ్యలో పాల్గోని విజయ వంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో పట్టణ రజక సంఘం ప్రధానకార్యదర్శి కొత్తకొండ పోషం, కోశాధికారి నస్పూరి పోశం, ముఖ్య సలహదారు, మీడియా ప్రతినిధి నేరెళ్ళ రమేష్, ఉపాధ్యాక్షులు పోచంపల్లి ధర్మయ్య.. నిమ్మరాజుల కుమార్, నల్లూరి మల్లయ్య, బండి తిరుపతీ,కండె కృష్ణ,లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.