కంటి వెలుగు శిబిరం విజయవంతం

కంటి వెలుగు శిబిరం విజయవంతం

19వ వార్డు కౌన్సిలర్ గ్యాదరి రవీందర్

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం వల్ల ఎంతోమంది పేదలకు కంటి చికిత్స ఉచితంగా లభించిందని సిద్దిపేట 19వ వార్డు కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ అన్నారు. రెండవ విడత కంటి వెలుగు ముగింపు కార్యక్రమం సిద్దిపేట అరుంధతి కళ్యాణ మండపంలో జరిగింది. ఇన్నాళ్లు రెండో విడత శిబిరంలో పాల్గొన్న వైద్యులు, ఆశా వర్కర్ల, అంగన్వాడి టీచర్ల  అందరికీ స్టిల్ టిఫిన్ బాక్సులు కౌన్సిలర్ గ్యాదర్ రవీందర్ బహుకరించారు కార్యక్రమం విజయానికి సూచికగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రవీందర్  మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత పేద ప్రజలకు వైద్యం మరింత చేరువైందని కొనియాడారు.కంటి వెలుగు శిబిరంలో సుమారు 1631 మందికి కంటి పరీక్షలు నిర్వహించి. ఇందులో దాదాపు 100 మందికి  శిబిరంలోనే కళ్ళద్దాలు ఇవ్వడం జరిగిందని సైట్ ఎక్కువ ఉన్న 65 మందికి ఆర్డర్ పై తెచ్చి అందజేయడం జరిగిందన్నారు.

కంటిలో పొరలు ఉన్న 136మందికి ఆపరేషన్ కి రిఫర్ చేయడం జరిగిందని.అవసరమైన వారికి మందులు అద్దాలు అందజేశామని తెలిపారు.కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరం ఉన్నవారికి మందులు కంటి అద్దాలతో పాటు ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేస్తారని చెప్పారు.తమ వార్డులో వారం రోజులపాటు పేద ప్రజలకు సేవలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ ఆఫ్రీన్,ప్రియాంక,వార్డ్ అధ్యక్షులు బయ్యారం ఇస్తారి, నాయకులు పుట్ల దినేష్,అడప సబ్దర్,వార్డ్ ఆఫీసర్ ఆర్ ఐ కిష్టయ్య ఏఎన్ఎంలు,ఆర్ పి లు జ్యోతి,రేణుక,యాదమ్మ,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.