సింగరేణికి రెండు వేల కోట్ల ఆదాయం.. సింగరేణి సంబరాల్లో డైరెక్టర్ పా బలరాం

సింగరేణికి రెండు వేల కోట్ల ఆదాయం.. సింగరేణి సంబరాల్లో డైరెక్టర్ పా బలరాం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి సంస్థ రెండు వేల కోట్ల రూపాయల  ఆదాయాన్ని సముపార్జించిందని సింగరేణి డైరెక్టర్ ( పా) బలరాం తెలిపారు. సోమవారం ప్రగతి స్టేడియంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమాని బలరాం తో పాటు పెద్దపల్లి ఎంపీ.బోర్లకుంట్ల వెంకటేష్ నేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ, కార్మికుల భాగస్వామ్యంతో సింగరేణి లాభాల బాటలో పయనిస్తోందన్నారు.

రెండు వేల కోట్ల ఆదాయంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు లాభాల బోనస్ ఇతర రూపాల్లో కార్మికులకు చెల్లిస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థ లాభాలలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం ఎంతో ఉందని కొనియాడారు. కార్మికులు, ఉద్యోగుల పట్ల కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు. వారి బంగారు భవిష్యత్తు కోసం అనేక హామీలు ఇవ్వడమే కాకుండా దశల వారిగా అమలు చేస్తున్నారని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు గృహ నిర్మాణాలకు రుణాలు ఇపించనున్నట్లు వెల్లడించారు.  సింగరేణి సంస్థ ఒడిస్సాకు విస్తరించడం కాకుండా విశ్వవ్యాపితంగా ఉజ్వలించాలని ఆయన ఆకాక్షించారు. అనంతరం వెంకటేష్ నేత మాట్లాడుతూ, కేసీఆర్ సింగరేణిని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాడానికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో శ్రీరాంపూర్ సింగరేణి జేఎం. సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు కేంగర్ల మల్లయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.