2024 ఎన్నికలే టార్గెట్‌గా  సీఎం జగన్‌ మరో సంచలనం నిర్ణయం

2024 ఎన్నికలే టార్గెట్‌గా  సీఎం జగన్‌ మరో సంచలనం నిర్ణయం
  • 27 స్థానాల్లో అభ్యర్థుల మార్పు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచింది. వైసీపీ ఇన్‌ఛార్జీల విషయంలో కూడికలు తీసివేతల లెక్కలతో ముందుకు వెళ్తోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్‌ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల వైసీపీ ఇన్‌ఛార్జులను మార్చిన వైసీపీ అధినేత సీఎం జగన్.. రెండో లిస్ట్ 27 స్థానాల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్ సీపీ కొత్త ఇన్ ఛార్జుల జాబితా..

అనంతపురం ఎంపీ – శంకర నారాయణ, హిందూపూర్ ఎంపీ- శాంత, అరకు ఎంపీ – కొత్తగూళ్ల భాగ్యలక్ష్మి, రాజాం – తాళ్ల రాజేష్, అనకాపల్లి – మాలశాల భరత్ కుమార్, పాయకరావుపేట – కంబాల జోగులు, రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాశ్, పి.గన్నవరం – వేణుగోపాల్, పిఠాపురం – వంగా గీత, జగ్గంపేట – తోట నర్సింహం, ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ – మార్గాని భరత్, విజయవాడ సెంట్రల్ – వెలంపల్లి శ్రీనివాస్, మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి, విజయవాడ వెస్ట్ – షేక్ ఆసీఫ్, రాజమండ్రి రూరల్‌– చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి-– మక్బూల్‌ ఆహ్మద్‌, ఎర్రగొండపాలెం– తాటిపర్లి చంద్రశేఖర్‌, ఎమ్మిగనూర్‌– మాచాని వెంకటేశ్‌, తిరుపతి- – భూమన అభినయ్‌ రెడ్డి, గుంటూరు ఈస్ట్‌ – షేక్‌ నూరి ఫాతిమా, మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి– చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ- –  ఉషా శ్రీచరణ్‌, కల్యాణ దుర్గం – తలారి రంగయ్య, అరకు – గొడ్డేటి మాధవి, పాడేరు – విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ – వెలంపల్లి శ్రీనివాస్, 

నలుగురు ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం..

ఎంపీ మార్గాని భరత్‌కు రాజమండ్రి సిటీ సెగ్మెంట్‌, ఎంపీ వంగా గీతకు  పిఠాపురం సెగ్మెంట్, ఎంపీ గొడ్డేటి మాధవికి అరకు, ఎంపీ తలారి రంగయ్యకి కల్యాణదుర్గం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.

ఐదుగురు వారసులకు ..

పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తికి బందర్,  భూమన కుమారుడు అభినయ్‌కి తిరుపతి,  చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డికి చంద్రగిరి, పిల్లి సుభాశ్​బోస్ కుమారుడు సూర్యప్రకాశ్ కి ఆర్సీపురం,షేక్ ముస్తఫా కూతురు నూరి ఫాతిమాకి గుంటూరు ఈస్ట్‌ కేటాయించారు.