సుడాన్​లో అంతర్యుద్ధం

సుడాన్​లో అంతర్యుద్ధం
  • వైమానిక దాడులతో 22 మంది మృతి
  • ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రజల మొగ్గు

సుడాన్​: సుడాన్ లో ఆర్మీకి, పారామిలటరీ దళాలకు మధ్య జరుగుతున్న పోరులో అమాయకులు బలవుతున్నారు. శనివారం రాత్రి జరిగిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 22 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఏప్రిల్ 15 నుంచి ఆర్మీకి, పారామిలటరీ దళాలకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఈ అంతర్యుద్ధం చెలరేగుతోంది. ఆర్మీ కమాండర్ జనరల్​అబ్దుల్​ఫతేహ్ బురాన్, పారామిలటరీ అధ్యక్షుడు జనరల్ మహమ్మద్​హమ్దాన్​డగ్లే మధ్య వివాదాలు నెలకొనడంతో అంత్యర్యుద్ధం చెలరేగింది. సూడాన్ రాజధాని కార్తూమ్​కు దగ్గరగా ఉన్న నగరం ఓడర్మాన్​లోని ఓ నివాస భవనంపై వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 22 మంది చనిపోయినట్లు, అనేకమంది గాయపడినట్లు ఆదివారం వార్తలు వెలువడ్డాయి. కాగా ఈ అంతర్యుద్ధంతో సూడాన్​లో నివసిస్తున్న సామాన్య ప్రజానీకం ఇతర దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుండడంతో ఆ దేశ చుట్టుపక్క దేశాలు తమ బార్డర్లను కట్టుదిట్టం చేశాయి. అక్రమ చొరబాట్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.