గురుకులాలకు రూ.22.56 కోట్లు విడుదల

గురుకులాలకు రూ.22.56 కోట్లు విడుదల

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొనసాగుతోన్న గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం రూ.22,56,36,000 విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాసంవత్సరం పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో గురుకులాల్లో సదుపాయాలు, ముందస్తు ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.