24 గంటల కరెంట్ బి.ఆర్.ఎస్ కావాలా 3 గంటల కాంగ్రెస్ కావాలా : కేటీఆర్

24 గంటల కరెంట్ బి.ఆర్.ఎస్ కావాలా 3 గంటల కాంగ్రెస్ కావాలా : కేటీఆర్

వలిగొండ (ముద్ర న్యూస్) : వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందించే బి.ఆర్.ఎస్ కావాలా లేక వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అనే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి అని వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ మూడో తేదీన ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, ఇప్పటివరకు 55 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారు చూపించాలంటున్నారు, కాంగ్రెస్ నాయకులకు చాతనైతే వలిగొండ మండలంలోని ఏ గ్రామానికి అయినా వెళ్లి కరెంటు తీగలను పట్టుకుంటే 24 గంటల కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది అని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుందని అన్నారు. కాంగ్రెస్ కాలంలో కరెంటు కష్టాలు రాత్రిపూట కరెంటుతో రైతులు ఎంతోమంది కరెంటు షాక్ తో మరణించారని, పాముకాటు, తేలుకాటు, భార్యా పిల్లలను విడిచి బావులకాడ కరెంట్ కోసం ఎదురు చూడడం ఇలాంటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలయంలో రైతులు చెప్పరాని గొసలు అనుభవించారని అన్నారు.

రైతులకు 3 గంటల కరెంటు చాలు అనే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా 10 ఎచ్.పి మోటార్లతో వ్యవసాయం చేయడం లేదని వ్యవసాయం గురించి తెలియని నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. రైతు బంధు దండగా, దుబారా ఖర్చు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం ఎంత వరకు కరెక్ట్ అని అడిగారు. ఇవన్నీ రైతుల బాధలు అర్దం చేసుకున్న కెసిఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ,రైతు భీమా లాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులుగా చేశారని అన్నారు. భువనగిరి బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి ""పైల్ల శేఖర్ రెడ్డి మంచి మనసున్న నేత, స్వచ్ఛమైన నాయకుడు అని, రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికిన ఇంతటి స్వచ్ఛమైన నేత మరొకరు ఉండరని"" కొనియాడారు. పైల శేఖర్ రెడ్డి తన సొంత డబ్బులతో ఈ నియోజక వర్గానికి ఎంతో సేవ చేశారని అన్నారు. ఇలాంటి స్వచ్ఛమైన నాయకుడు గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

డిసెంబర్ 3 తేదీన కచ్చితంగా ఏర్పడే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని రైతులకు రైతుబంధు 10,000 రూపాయల నుండి 16,000 రూపాయలకు పెంచుతాము అని, 18 సంవత్సరాలు వయసు నిండిన మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద 3 వేల రూపాయలు మహిళకు అందిస్తామని తెలిపారు. వృద్ధులకు ఆసరా పించను 2000 రూపాయల నుండి 5000 రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. బిజెపి అభ్యర్థికి ఓటు వేస్తే మూసి కాలువలో వేసినట్లే అని, బిజెపి అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేసి చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని తెల్ల కార్డు రేషన్ లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సదుపాయం, మరియు తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇంటింటికి సన్న బియ్యం సప్లై చేసేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం తపతకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల భూపాల్ రెడ్డి, కర్నే ప్రభాకర్,ఎలిమినేట్ సందీప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ,జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.