రైతులకు 24 గంటల కరెంట్ బోగస్ 

రైతులకు 24 గంటల కరెంట్ బోగస్ 
  • 24 గంటల కరెంటు విషయంలో బోల్తా పడ్డ ప్రభుత్వం 
  • టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ 

ముద్రా, షాద్‌నగర్ :-రైతులకు 24 గంటలపాటు త్రీ ఫేజ్‌ కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని, రేవంత్ రెడ్డి వాస్తవాలు బయటి ప్రపంచానికి చెప్పాక ఇప్పుడు ప్రభుత్వం బోల్తాపడ్డ విషయం తెలుసుకుని రైతాంగం మేలుకుంటుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించారు.  అక్కడ కరెంటు సరఫరా వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం 24 గంటల కరెంటు ఎక్కడ ఇవ్వలేదని, అంతటా 10, 11 గంటలు లేదా 13 గంటల వరకు మాత్రమే కరెంటు సరఫరా చేసిందని 24 గంటల కరెంటు ఎక్కడ ఇవ్వలేదని చెప్పారు. సాక్షాదారాలతో సహా ప్రభుత్వ రికార్డులను పరిశీలించి వాస్తవాలను చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వం 24 గంటల కరెంటు విషయంలో బోల్తా కొట్టిందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతోందని అసత్యాలు చెప్పించడం సిగ్గు చేటు అని, ప్రభుత్వ మూర్ఖపు విధానాలతో విద్యుత్‌ రంగం రూ.వేల కోట్లు నష్టాలపాలైందనీ ఈ విషయాన్ని దాచిపెట్టి వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నట్లు ప్రసంగంలో పేర్కొనడం దుర్మార్గం ఆన్నారు. మిగులు ఆదాయంతో ఏర్పడ్డ రాష్ర్టాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అనీ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమములో  మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఇత్తర స్థానిక నాయకులు పాల్గొన్నారు.