ఎకరానికి 25వేలు రైతులకు పరిహారం ఇవ్వాలి - కలెక్టర్ ను కోరిన బీజేపి నేతలు

ఎకరానికి 25వేలు రైతులకు పరిహారం ఇవ్వాలి - కలెక్టర్ ను కోరిన బీజేపి నేతలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఎకరానికి 25వేల రూపాయలు ఇవ్వాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం  బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ను అందజేశారు. చేతికి అందిన పంట వర్షాల వల్ల  ధాన్యం తడిసి రైతులు నష్ట పోయారని రఘునాథ్ రావు  మీడియాకు  తెలిపారు. ఎకరానికి 25వేలు నగదు పరిహారం గా చెల్లించి ఆదుకోవాలని కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి బస్తాకు 2, 3 కిలోలు తరుగు పేరుతో కోత పెడుతున్నారని  కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు  తెలిపారు. తరుగు లేకుండా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వలన రైతులు నష్టపోతున్నందున ప్రభుత్వం భేషజాలకు పోకుండా అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి  మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, లక్షెట్టిపేట్  మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, హాజీపూర్ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, హరికృష్ణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.