పుట్టినరోజు నాడు 4ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... 

పుట్టినరోజు నాడు 4ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... 

టేకులపల్లి, ముద్ర: ఇటీవల తెలంగాణ స్టేట్ లో వరుసగా వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఓ అంగన్వాడి కేంద్రం వద్ద నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన మంగళవారం జరిగింది. రేగులతండా గ్రామానికి చెందిన చిన్నారి తండ్రి ఇస్లావత్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం... టేకులపల్లి గ్రామపంచాయతీ ముత్యాలమ్మ గుడి సమీపంలోని అంగన్వాడి కేంద్రానికి నా కుమారుడు అక్షయ్ నాయక్(4)  వెళ్లాడు. ఈ క్రమంలో అంగన్వాడి కేంద్రం నుంచి టాయిలెట్ కి బయటికి వచ్చినట్టు అంగన్వాడి సిబ్బంది తెలిపారు. బయటకొచ్చిన అక్షయ పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి ఎడమ కాలుకి ఏడు గాట్లతో   కరిచి తీవ్రంగా గాయపరిచాయి. వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ బాబు పెద్దగా కేకలు వేశాడు. బలుడిని వెంటనే స్థానిక సులానగర్ పీహెచ్సీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. పుట్టినరోజు నాడే తన కుమారుడికి కుక్కలు దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. టేకులపల్లి మండలంలో వీధి కుక్కలు బెడద అధికంగా ఉందని మండల అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకొని, విధి కుక్కల బెడద నుంచి రక్షించాలన్నారు.