ఆటో లారీ డీ 5 గురు మృతి

ఆటో లారీ డీ 5 గురు మృతి

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నిడుమనూరు మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద ఆదివారం రాత్రి బైక్ పై రోడ్డు దాటుతున్న బల్గురి సైదులు బైక్ అదుపుతప్పి అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్ర గాయలైన శివను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందారు.

కాగా శివ బంధువులు తెల్లవారుజామున ఆటోలో మిర్యాలగూడ ఆసుపత్రికి వెళ్తుండగా దట్టమైన పొగమంచు కారణంగా దారి కనిపించక ఎదురుగా వస్తున్న లారీ డీ కొట్టింది. ఆటోలో వున్న ముగ్గురు మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మారో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పెద్దవూర మండలం పూల్యతండా వాసులు గా భావిస్తున్నారు.