బాధిత కుటుంబానికి 6వేల ఆర్థిక సహాయం అందజేసిన : బాల్యమిత్ర ఫౌండేషన్

బాధిత కుటుంబానికి 6వేల ఆర్థిక సహాయం అందజేసిన : బాల్యమిత్ర ఫౌండేషన్

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి సోమవారం ఎల్లారెడ్డిపేట బాల్యమిత్ర ఫౌండేషన్ వారు ఆరే నరసయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పిస్తూ 6వేల ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్ర ఫౌండేషన్ సభ్యులు సందుపట్ల లక్ష్మారెడ్డి, రావుల ఎల్లారెడ్డి, డాక్టర్ హైమద్, గోగురి శ్రీనివాస్ రెడ్డి, నెవూరి రామేశ్వర్ రెడ్డి, రేసు మోహన్,అంతేర్పుల దేవరాజు, జేరుపోతుల రాములు, యోహన్, శ్యామ మంజుల తదితరులు పాల్గొన్నారు.