మెదక్ జిల్లాలో 7 నామినేషన్ లు

మెదక్ జిల్లాలో 7 నామినేషన్ లు
  • నర్సాపూర్ లో కాంగ్రెస్ లో గాలి సైతం నామినేషన్

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో బుధవారం 7 నామినేషన్ లు దాఖలయ్యాయి. మెదక్ అసెంబ్లీ స్థానానికి మెదక్ పట్టణానికి చెందిన వనపర్తి రోహిత్ భారత్ చైతన్య యువజన పార్టీ తరపున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చేగుంట మండలం చిన్న శివనూరుకు చెందిన అడ్ల కుమార్, టేక్మాల్ మండలం ఎలకుర్తి గ్రామానికి చెందిన పట్లోళ్ల బాపురెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ లు రిటర్నింగ్ అధికారి అంబదాస్ కు అందజేశారు.

జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ లు దాఖలు చేశారు. బిఆర్ఎస్ నుండి శివ్వంపేట మండలం గోమారంకు చెందిన మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ బి ఫాం దక్కిన మాసాయిపేటకు చెందిన న్యాయవాది ఆవుల రాజిరెడ్డితో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ మెదక్ పార్లమెంట్ ఇంచార్జి, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కు చెందిన గాలి అనిల్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశారు. బిజెపి నుండి మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీ యాదవ్ తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్ లు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించడంతో నర్సాపూర్ పట్టణం సందడిగా మారింది.