రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
- ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, ఎమ్మార్వో కార్యాలయం వద్ద తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో భాస్కర్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై భాస్కర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు పాటీ సుధాకర్ రెడ్డి, 101 యూత్ అసోసియేషన్ వద్ద అధ్యక్షుడు వంగూరి బాలకృష్ణ, బోధిధర్మ యోగ అండ్ అసోసియేషన్ వద్ద అధ్యక్షులు సీత భాస్కర్ మరియు వివిధ స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అదే విధంగా పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో జాతీయ స్ఫూర్తి, దేశభక్తి పెంపొందేలా కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమములో మునిసిపల్ కమీషనర్ వీరా రెడ్డి, వైస్ ఛైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు దారెడ్డి మంజుల , కొంగరి కృష్ణ, సురుకంటి జ్యోతి రంగారెడ్డి, పెద్దల చక్రపాణి, కర్నాటి రవీంధర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, భోగ భానుమతి విష్ణు, మోటే రజిత రాజు, కుడికాల అఖిల బలరాం, దేవరాయ కుమార్, కో ఆప్షన్ సభ్యులు జల్ది నర్సింహా, రావుల లావణ్య, సయ్యద్ అజ్ఘర్ , నూస్రత్ సుల్తానా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.