శంషాబాద్ విమానాశ్రయం లో మిక్సర్ గ్రైండర్ లో 819 గ్రాములు గోల్డ్ స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయం లో మిక్సర్ గ్రైండర్ లో 819 గ్రాములు గోల్డ్ స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు  ఓ ప్రయాణికుడి నుంచి మిక్సర్ గ్రైండర్ లో 819 గ్రాములు బంగారం  స్వాధీనం చేసుకున్నారు.కస్టమ్స్‌ అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్‌ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌  ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న మిక్సర్‌ గ్రాండర్‌లో దాచి 819 గ్రాముల బంగారం తీసుకువచ్చినట్లు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.49.79 లక్షల ఉంటుందని వివరించారు. ఈ మేరకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు