అన్నారంలో  ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీ లు

అన్నారంలో  ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీ లు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో శనివారం జైపూర్ ఏసిపి నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంటింటా జరిపిన తనిఖీల్లో 70 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు ,మూడు టాటా ఏసీఈలు ,రెండు బొలెరో వాహనాలు అనుమతి పత్రాలు లేని కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం గ్రామంలోని 50 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం ,చీరలు, యువకులకు వాలీబాల్ కిట్స్ లను ఏసీపీ నరేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ పోలీసులు ప్రజల్లో మమేకం కావడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి పోలీసులు తమ వంతు కృషి చేస్తారని ఆయన చెప్పారు. ఎలాంటి అసాంఘిక శక్తుల వైపు మరలకుండా యువకులు ఉద్యోగ ఉపాధ్యాయ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. యువకులు ఆన్ లైన్ గేమ్ లకు ఆకర్షితులై మోసపోవద్దని అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామంలో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, వాహన అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడవద్దని అన్నారు. కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ.విద్యాసాగర్, ఎస్సైలు వెంకట్, సుబ్బారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.