తొలి రెండు గంటల్లో 9.24 శాతం పోలింగ్

తొలి రెండు గంటల్లో 9.24 శాతం పోలింగ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడం కనిపించింది. ఉదయం తొమ్మిది గంటల వరకు రెండు గంటల వ్యవధిలో 9.24 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈద్గామ్ పోలింగ్ కేంద్రాన్ని, కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా  ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.