కొండగట్టు ఆలయ ఈఓగా ఏ చంద్రశేఖర్ నియామకం

కొండగట్టు ఆలయ ఈఓగా ఏ చంద్రశేఖర్ నియామకం

ముద్ర, మల్యాల : మండలంలోని ముత్యంపేట (కొండగట్టు) ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఈఓగా ఏ చంద్రశేఖర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు  ఆలయ నిధులు అవకతవకల కారణంగా ఈవో వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ కాగా, ఆయన స్థానంలో ఎండోమెంట్ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ను బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విధుల్లో చేరారు