వరి,మొక్క జొన్న పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలి

వరి,మొక్క జొన్న పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలి

  • మామిడి రైతులకు ఎకరా 25 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి..
  • చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి..
  • జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి,మొక్క జొన్న పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలని జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.  జగిత్యాల మోతే రోడ్డు లోని బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్  100 రోజుల పాలన పూర్తి అయిందని, 420 హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం ప్రతి వ్యవసాయ ఉత్పత్తులకు రూ. 500 బోనస్ ఇస్తామని జగిత్యాల నడి బొడ్డున చెప్పారని గుర్తు చేశారు. నియోజకవర్గం లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి రాబోతుంది... 2200 వరి మద్దతు ధర తో పాటు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  రైతు బందు సైతం ఇవ్వలేని పరిస్తితిలో ఉందన్నారు. మామిడి పంట కు ఇప్పటికే తామర పురుగు, తేనె మంచు రోగాలతో అధిక నష్టం వాటిల్లిందని, జగిత్యాల నియోజకవర్గ లో 35 వేల ఎకరాల లో 30 వేల ఎకరాలలో మామిడి పంట కు నష్టం వచ్చిందని, హార్టి కల్చర్ అధికారులతో కనీసం సమావేశం నిర్వహించారా అని ప్రశ్నించారు. ఎకరా 25వేల చొప్పున ఇచ్చి  మామిడి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ లో ఉన్న 19 టియంసిల నీరు ఉందని జగిత్యాలలో ఒక్క ఎకరం ఎండకుండా చూడాలని, వరి మొక్క జొన్న పంటలకు బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దావా సురేష్ ,జెడ్పీటీసీ మహేష్, వైస్ ఎంపీపీరాజేంద్రప్రసాద్, జంబర్తి శంకర్, రాజీ రెడ్డి, శేకర్ రెడ్డి, గంగారెడ్డి, హరీష్, బాల ముకుందం, అరిఫ్, బిక్షపతి, లక్ష్మణ్, సతిరెడ్డి, వంశీ బాబు, ఏనుగుల రాజు, తదితరులు పాల్గొన్నారు.