మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య..

మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య..

ముద్ర,హైదరాబాద్: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది.ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవికుమార్ అనే సాఫ్ట్వేర్ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. హత్య చేసిన తర్వాత కారంపొడి, పసుపు చల్లి పారిపోయారు నిందితులు.గత సంవత్సరన్నర కాలంగా ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవికుమార్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసముంటున్నారు.

బుధవారం (మే 8) సాయంత్రం 4 గంటల సమయంలో రవికుమార్ ను ఇంట్లోనే హత్యచేశారు. రవికుమార్ను హత్య చేసిన అనంతరం ఘటనా స్థలంలో కారంపొడి, పసుపు చల్లి పారిపోయారు. వాకింగ్ కు వెళ్లి భార్య ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి రవికుమార్ విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తలపై బలమైన వస్తువుతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.