ఘోర రోడ్డు ప్రమాదం... 21 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం... 21 మంది మృతి

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఆఫ్గనిస్థాన్‌లోని హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని గెరాష్క్‌ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది చనిపోయారు. 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానిక అధికారులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.