నాలుగేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి

నాలుగేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి

కల్లూరు, ముద్ర: ఖమ్మం జిల్లా కల్లూరులో మంగళవారం నాలుగేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నర్సరీ చదువుతున్న కారుణ్య అనే చిన్నారి స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా.. పిచ్చి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి దవడ, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.