ప్రభుత్వం ఉద్యోగం సాధించిన యువకుడికి ఘనంగా సన్మానం

ప్రభుత్వం ఉద్యోగం సాధించిన యువకుడికి ఘనంగా సన్మానం

ముద్ర.వీపనగండ్ల:- పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిట్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించిన వీపనగండ్ల విద్యార్థి బత్తుల విజయ్ కుమార్ యాదవ్ ను యాదవ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. బత్తుల యాదయ్య సరోజ దంపతుల కుమారుడు విజయ్ కుమార్ యాదవ్  ఇటీవల వెలువడిన ఏఈఈ నోటిఫికేషన్ ఫలితాలలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో యువకుడిని  అభినందిస్తూ సన్మానించారు.

ఈ సందర్భంగా యాదవ సంఘం యూత్ అధ్యక్షుడు మదుగని శివ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎత్తం కృష్ణయ్య లు మాట్లాడుతూ విజయ్ కుమార్ యాదవ్ ఇంకా భవిషత్ లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని అలాగే  ఉద్యోగ వృత్తిలో మచ్చలేని ఉత్తమ ఆఫీసర్ గా ఎదగాలని,యువత నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ఎదగాలని అన్నారు.బత్తుల విజయ్ కుమార్ యాదవ్ చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల లో చదివి అనంతరం ర్యాంకర్స్ హై స్కూల్ వనపర్తి, సివిల్ విభాగంలో డిప్లమా కేడీఆర్ పాలిటెక్నికల్ కళాశాల వనపర్తి, బీటెక్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి లో పూర్తి చేయడం జరిగిందన్నారు.

సివిల్ విభాగంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) గా గజిటెడ్  ఉద్యోగం సాధించడం పట్ల విజయ్ కుమార్ ను  తల్లిదండ్రులను యాదవ సంఘము సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.గ్రామంలోని యువత విజయ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆంకాంక్షించారు.కార్యక్రమంలో నాయకులు ఎత్తం బాలస్వామి,ముంత శివయాదవ్, అపోలో నారాయణ వెంకటయ్య, రాజు, మహేష్,వెంకటేష్ యాదవ్,రమేష్ యాదవ్,కానమోని శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు