జర్నలిస్టుల కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి

జర్నలిస్టుల కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి

  • జర్నలిస్టులకు భద్రత, రక్షణ, మీడియా స్వేచ్ఛకై ప్రత్యేక చట్టాల రూపొందించాలి
  • జర్నలిస్టుల హక్కుల సాధనకై ఉద్యమించి సాధించుకుంటాం
  • సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే, రాజకీయ నాయకులకు వినతి పత్రాలు అందజేత
  • టియుడబ్ల్యూ (ఐజేయు) వనపర్తి జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్

ముద్ర.వనపర్తి: జర్నలిస్టుల కోసం జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు శాంతి భద్రత, రక్షణ, మీడియా స్వేచ్ఛకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని టి యుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ అన్నారు. శనివారం జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో TUWJ (iju) ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకొని ధర్నా చేశారు. అంతకుముందు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు చిత్రపటాలకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి  డి. మాధవరావు, జాతీయ నాయకులు మాల్యాల బాలస్వామి, ప్రశాంత్,ఉషన్నలు మాట్లాడుతూ... జర్నలిస్టుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును మార్చుకోవాలని, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (NEC) సమావేశంలో షాహిద్ భగత్ సింగ్ అమరవీరుడు అయిన మార్చి 23న మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. చాలా కాలంగా ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు,డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చిందన్నారు. ఈ మేరకు  మీడియా సమస్యల యొక్క మొత్తం సమస్యలు పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేస్తే సమాధానం వస్తుందన్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక జాతీయ శాసనాన్ని రూపొందించడం ద్వారా మీడియా భారత ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా పరిగణించబడుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, కానీ ఆ స్వేచ్ఛ అంతకంతకూ దెబ్బ తింటుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు , జర్నలిస్టులు కాని వారి కోసం వేజ్ బోర్డును ఏర్పాటు చేయడం, వాటి డిమాండ్లతో కూడిన  మజితియా వేజ్ బోర్డ్,  2007లో ఏర్పాటైందని గుర్తు చేశారు. గత దశాబ్దంలో సగం ద్రవ్యోల్బణం చాలా నిటారుగా ఉందిని ,ప్రభుత్వ,  ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వేతనాలు రెండుసార్లు సవరించబడ్డాయని, అయితే వార్తాపత్రిక పరిశ్రమ ఉద్యోగులు పెంచకుండా మిగిలిపోయింది అన్నారు.ఈ సమస్యలు చాలా ముఖ్యమైనవి, సరిగ్గా పరిష్కరించబడినవి మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చాలా దూరం వెళ్తాయన్నారు. కావున అన్ని రాజకీయ పార్టీలు , ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా మా డిమాండ్‌లకు మద్దతు ఇవ్వాలని ,రాబోయే ఎన్నికల కోసం మీ ఎజెండాలో వాటిని చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యపై గళం విప్పుతానని, వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు నారాయణకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వల్లే జర్నలిస్టులు కు న్యాయం జరుగుతుందని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులకు మీ విన్నపాలను సమర్పించి కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులపై సానుకూలత గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్టాఫ్ రిపోర్టర్లు,పౌర్ణ రెడ్డి శ్రీనివాసరావు, జగత్ పల్లి రాజు, నాకొండ యాదవ్, వెంకట్ గౌడ్, రాజేందర్, ఉర్డు కమల్ రాజు, గంధం దినేష్, భాస్కర్, మోహన్, విజయ్, శ్రీనాథ్, స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా తేజ వర్ధన్, అంజి,బి.టీవీ రవి కుమార్, తరుణ్, వహీద్, ఫరూక్ పటేల్ ప్రెస్ అధ్యక్షులు బాలవర్ధన్, సిందే శ్రీను వాసులు, విజయ్,పరుశురాం, రాజేంద్రప్రసాద్ శెట్టి,భానుప్రకాశ్ గౌడ్, కృష్ణ, శ్రీనివాసులు, కృష్ణ, విజయ్,బాలరాజు, వెంకటేష్ గౌడ్, వివిధ మండలాల రిపోర్టర్ లు అధికసంఖ్యలో  పాల్గొన్నారు.