సమస్యలను పట్టించుకునే వారేరి
- గోపాల్ దీన్నే లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి
ముద్ర. వీపనగండ్ల:- స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే పాలకులకు అధికారులకు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోపాల్ దీన్నే లో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సమస్యలపై అధ్యయనం చేసి గ్రామ పంచాయతీల కార్యదర్శిలకు వినతిపత్రం అందించడం జరిగిందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐదు రోజులపాటు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిన గ్రామాలలో ఎక్కడ కూడా ఆనవాళ్లు కనబడటం లేదని, గోపాల్ దిన్నె గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్ల పైన మురుగునీరు నిలవండి దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. గ్రామంలో పలు కాలనీలో మురుగు కాలువలు నిర్మించి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గత పది రోజుల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులను పరిశీలించాలని, రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని, పంట రుణమాఫీ అందరికీ మాఫీ చేసి కొత్త పంట రుణాలు ఇవ్వాలని. పంట పెట్టుబడి కోసం అందించే రైతు భరోసానిధులను వెంటనే విడుదల చేయాలని బాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.నాయకులు నరసింహ, చంద్రయ్య, కురుమయ్య, కృష్ణయ్య, రాముడు, మల్లేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.