పాపం ఒక నిముషం ఆలస్యం వాళ్ళ పరీక్షకు దూరం

పాపం ఒక నిముషం ఆలస్యం వాళ్ళ  పరీక్షకు దూరం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాగా ఒక నిముషం ఆలస్యం నిబంధన కారణంగా ఏడుగురు విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యారు.అయితే ఒక ప్రైవేటు విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సిన విద్యార్థులు నిర్ణీత సమయానికి కొంత ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. తాము అక్కడే పరీక్ష రాస్తామని వారు పట్టు పట్టారు. కాగా ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి పరశురామ్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించారు.