ఏపీ మంత్రి  ఆదిమూలపు సురేష్​కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ మంత్రి  ఆదిమూలపు సురేష్​కు తృటిలో తప్పిన ప్రమాదం

 ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‎కు  తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖలో  జి 20  సన్నాహక సమావేశాలు, స్వాగతం పలుకుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే.. ఆదివారం విశాఖ ఆర్కే బీచ్‎లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.

గాలివాటం సరిగా లేకపోవడంతో వన్ సైడ్‎కి ఒరిగిపోయింది. దీంతో మంత్రి  వ్యక్తిగత  సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రి సురేష్  ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలా ఒక్కసారిగా క్షణాల్లో జరిగిపోవడంతో అక్కడున్న ఇతర మంత్రులు షాక్‎కుగురయ్యారు. మంత్రికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.