ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి
  • చిన్నతనంలోని తండ్రిని కోల్పోయిన చిన్నారులు
  • కుటుంబంలో విషాదఛాయలు

ముద్ర,ఎల్లారెడ్డిపేట:- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గురువారం రాత్రి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం వెళ్తూ అదుపుతప్పి కింద అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పెంటం పద్మయకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు ప్రవీణ్, చిన్న కొడుకు కుమార్ (33) అనే వ్యక్తి బైక్ మెకానిక్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదే క్రమంలో గురువారం రోజు విధిలు నిర్వయించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఇంటి సమీపాన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు.ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగ అక్కడికక్కడే మృతి చెందాడు.గురువారం రాత్రి పూట కుమార్ ఇంటికి రాలేదని తల్లిదండ్రులు మరియు అతడి భార్య కుమార్ ఆచూకీ కోసం వెతకడం ప్రారంబించారు.

శుక్రవారం ఉదయం స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదానికి గురైన కుమార్ ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు స్థానికులు గుర్తించారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన కుమార్ అతి వేగంతో ద్విచక్ర వాహనం నడుపి బైకు అదుపుతప్పి ప్రమాదానికి గురై మృతి చెంది ఉండవచ్చు అని స్థానికులు పేర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. మృతునికి భార్య సోనీ, కుమారులు చరణ్,హర్షిత్ లు ఉన్నారు. కుమారుల చిన్నతనంలోనే తండ్రి కళ్ళముందే మృతి చెందడంతో బోరున విలపిస్తున్నారు.దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి గ్రామస్తులు అంటున్నారు.