వైద్య రంగానికి పెద్దపీఠ

వైద్య రంగానికి పెద్దపీఠ

మంచిర్యాల కు మెడికల్ కాలేజ్ నిదర్శనం: ఎమ్మేల్యే దివాకర్ రావు
ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : బీఆరెస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి పెద్దపీఠ వేస్తోందని ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం ఎఫ్ సీఏ ఫంక్షన్ హల్ లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైద్య ,ఆరోగ్య దినోత్సవం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు కలెక్టర్ సంతోష్, జిల్లాలోని వైద్య అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అన్నారు. 

వైద్యశాలలు ఏర్పాటు, వైద్యుల నియామకం, సిబ్బంది నియమకాలు చేసి నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం చొరవ ఎంతో ఉందని కొనియాడారు. ముక్యంగా మంచిర్యాల కు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం వల్ల చుట్టుపక్కల జిల్లాలు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే రోగులకు మంచి వైద్యం లభిస్తుందని తెలిపారు. కొద్దీ నెలల్లో మెడికల్ కాలేజ్ సొంత భవనం పూర్తయి ఆసుపత్రి స్థాయి పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం, డయాగ్నోస్టిక్ సెంటర్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.