రానున్నా అసెంబ్లీ ఎన్నికల లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు

రానున్నా అసెంబ్లీ ఎన్నికల లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు
  • సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
  • రంగారెడ్డి జిల్లా లో ఎన్నికల నిర్వాహణ పై సమీక్షా సమావేశం
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:- నియోజకవర్గాల  వారీగా సమస్యాతామక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని, పోలింగ్ స్టేషన్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో  సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాతామక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, అసెంబ్లీ నియోజకవర్గాల కోసం గుర్తించిన ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పై సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ పోలీసు కమిషనర్ డి.సి.చౌహాన్ లతో కలిసి  పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్బంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ మాట్లాడుతూ నియోజకవర్గాల  వారీగా సమస్యాతామక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని, పోలింగ్ స్టేషన్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. పంపిణీ, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద పట్టిష్టమైన భద్రతపై చేపడతామని తెలిపారు.ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీఆర్ఓ సంగీత, కందుకూర్, రాజేందర్ నగర్, కల్వకుర్తి, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు, శంషాబాద్, మహేశ్వరం, ఎల్.బి.నగర్, రాజేందర్ నగర్ డిసిపిలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.