హిమాలయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్

  • భారీగా ఎగిసి పడుతున్న మంటలు నేల మట్టమైన పరిశ్రమ.
  • మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న ఫైర్ అధికారులు...
  • ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్న స్థానికులు...!

షాద్ నగర్, ముద్ర: రంగారెడ్డి జిల్లానందిగామ మండల కేంద్రంలోని హిమాలయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (కంసన్) పరిశ్రమలో మంగళవారం అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు.సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.పరిశ్రమలోని మరో షెడ్డుకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు.దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...