సాదాసీదాగా కౌన్సిల్ సమావేశం

సాదాసీదాగా కౌన్సిల్ సమావేశం

రామకృష్ణాపూర్, ముద్ర : క్యాతన పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో అరు అంశాలతో కూడిన టేబుల్ ఎజెండాను మేనేజర్ నాగరాజు కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించగా ప్రవేశపెట్టిన ఆరు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. టేబుల్ ఎజెండాలోని అంశాలు ట్రాక్టర్లు, స్వచ్ఛ ట్రాలీల సామగ్రి కొనుగోలు,సర్వీసింగ్ కొరకు సాధారణ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు, వార్డు నెంబర్ 2 వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు పట్టణ ప్రగతి నిధుల నుంచి 4లక్షలు, ఖాళీ స్థలాలలో కంచె ఏర్పాటు,7,8,9,10 వార్డులలో అభివృద్ధి పనులు సిమెంట్ కాలువలు,రోడ్లు,క్రాస్ డ్రైనేజీ పైపు కొరకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి 51 లక్షలు, మోటారు పంపుల స్టార్టర్ బాక్సుల మరమ్మతులకు 94,515 ఖర్చును చెల్లించేందుకు, నీటి సరఫరా చేసే వాల్వులు,లీకేజీ,ఫాగింగ్ మిషన్ మరమ్మతులు, పారిశుద్ధ్య పనులకు ఉపయోగించే కెమికల్ ఖర్చు 86 వేలు కార్యాలయ సహాయ ఇంజనీర్ కు చెల్లించేందుకు, కార్యాలయంలో అవసరమయ్యే స్టేషనరీ కొనుగోళ్లకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి 50 వేల ఖర్చులకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఏఈ జయకృష్ణ ను కౌన్సిల్ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విద్యా సాగర్, 22 వార్డుల కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఆర్ఐ కృష్ణ ప్రసాద్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ వసంత్, జూనియర్ అసిస్టెంట్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.