గురుకుల అభ్యర్థులకు అన్ని పరీక్షలకు ఒకే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి.....

గురుకుల అభ్యర్థులకు అన్ని పరీక్షలకు ఒకే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి.....
  • పి వై ఎల్ డిమాండ్..

మోటకొండూర్ (ముద్ర న్యూస్):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను అభ్యర్థుల సొంత జిల్లాలోనే నిర్వహించాలని పివైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల తర్వాత నిర్వహించే గురుకుల ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షలను ఒకే పరీక్ష ఒక్కో జిల్లాలో నిర్వహించడం వలన గురుకుల టీచర్ అభ్యర్థులు సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. 200 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు వరుసగా ఏర్పాటు చేయడంతో చిన్నపిల్లలతో సహా గర్భిణీలుగా ఉన్న మహిళ అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు నాలుగు పరీక్షలకు ఒకే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పివైఎల్ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్. జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ. నాయకులు ఆకుల కృష్ణ. పాకాల నరేష్. పోనగాని అరుణ్. నిడిగొండ బాలరాజు. చింతపండు ప్రసాద్. గోధుమకుంట బాబు. ఆర్ ఉదయ్. పాకాల కార్తీక శ్రీ. పాకాల దీప శ్రీ తో పాటు తదితరులు పాల్గొన్నారు.