సంబంధాలను నెలకొల్పేందుకే ఆత్మీయ సమ్మేళనం...

సంబంధాలను నెలకొల్పేందుకే ఆత్మీయ సమ్మేళనం...

ఆలేరు (ముద్ర న్యూస్): చిన్ననాటి స్నేహితులంతా వివిధ వృత్తులు. వ్యాపారాల ద్వారా వివిధ ప్రాంతాలలో స్థిరపడి తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకుంటూ. తమ కుటుంబాల పోషణకై నిత్యం అన్వేషణలో ఉండే వారందరినీ ఒకటి చేసి సత్సంబంధాలను నెలకొల్పేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధ్యాపకులు హరగోపాల్ అన్నారు. ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 1999. 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పట్టణ కేంద్రంలోని దినేష్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదివిన పాఠశాలను. కన్న తల్లిదండ్రులను. గ్రామాలను ఎప్పుడు మర్చిపోకూడదని సూచించారు. ముందుగా నాటి స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 

అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాబురావు. హనుమంతు రెడ్డి. రమాదేవి. పగడాల శ్రీనివాస్. కుళ్ల సిద్ధులు. బీజని బాలరాజు. సుధారాణి. క్రాంతి. దూడల సాగర్. ప్రవీణ్. జూకంటి సిద్ధులు. ఇక్కిరి శ్రీనివాస్. బబ్బూరి కృష్ణ. ఎండి మహబూబ్. కుమార్. లక్కాకుల శ్రీను. అంబాల మహేందర్. లక్ష్మీనారాయణ. ప్రశాంత్. భాస్కర్. రాజు. భవిత. వసంత. అమరావతి. సుధాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.