రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తుర్కపల్లి, ముద్ర : స్కూటీ అదుపుతప్పి కెనాల్ పడి వ్యక్తి మృతి చెందగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఎలుగల అరవింద్ , బింగి శేషు  లు స్కూటీపై భవనగిరికి వెళుతుండగా ములకలపల్లి రోడ్డు క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన మూలమలుపు వద్ద ఉన్న కెనాల్ లో పడడంతో ఎలుగల అరవింద్ మరణించగా బింగి శేషు కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం శేషును భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.