ఓటు వినియోగించుకుంటూ సెల్ఫీ దిగిన యువకుడు

ఓటు వినియోగించుకుంటూ సెల్ఫీ దిగిన యువకుడు

కోరుట్ల, ముద్ర: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండలం  వేములకుర్తి గ్రామంలో అధికారుల నిర్లక్షం కారణంగా రెడ్డబోయిన జయరాజ్ 45 అనే యువకుడు పోలింగ్ స్టేషన్ లోకి సెల్ ఫోన్ తో వెల్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకుంటూ సెల్ఫీ దిగగా అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు యువకుడిని అదుపులోకి  తీసుకుని విచారణ నిమిత్తం పోలిస్ స్టేషన్ కు తరలించారు.