జీవితంపై విరక్తితో యువతి ఆత్మహత్య యత్నం...

జీవితంపై విరక్తితో యువతి ఆత్మహత్య యత్నం...

 అన్న 100 కి కాల్ చేయడంతో పట్టుకున్న పోలీసులు..
ముద్ర, మల్యాల: తనకు ఇక వివాహం జరగడం లేదని, జీవితంపై విరక్తితో ఓ యువతి ఆత్మహత్య యత్నం చేయగ, పోలీసులు గుర్తించి, పట్టుకున్న సంఘటన ఆదివారం మల్యాల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. స్థానిక ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు జగిత్యాల బుడిగే జంగాల ప్రాంతానికి చెందిన సిరిగిరి కవిత అలియాస్ ఫరీన (22)ది బోళ్ల వ్యాపారం. ఎప్పటిలాగే వ్యాపారంలో భాగంగా మల్యాలకు వచ్చిన యువతి,  తన అన్నకు ఫోన్ కాల్ చేసి, తనకు వివాహం జరగడం లేదంటూ.. తను రైలు కింద పడి చనిపోతున్నట్లు చెప్పింది.

వెంటనే యువతి అన్న 100 డయాల్ కు కాల్ చేసి విషయం తెలుపడంతో స్థానిక హెడ్ కానిస్టేబుల్ కనుకయ్య, సిబ్బంది తిరుపతి లు సిరియార్ అధికారులు ఇచ్చిన లొకేషన్ ఆధారంగా యువతిని గుర్తించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చి అప్పజెప్పినట్లు ఎస్ ఐ తెలిపారు.