మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఆందోళన

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి  వద్ద ఆందోళన

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అయన  ఇంటి  వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు అయనను అడ్డుకున్నారు. ఎందుకుబయటకు వెళ్ళనియ్యారనిపోలీసులను అయన ప్రశ్నించారు. రోడ్డుపైనే ఉండి నిరసన వ్యక్తం చేసిన ఆనంద్‌ బాబు,అంబేద్కర్‌ సాక్షిగా జీవో నెం1ని దగ్ధం చేసారుఉ. అనంద్‌ బాబు మాట్లాడుతూ పోలీసులు కూడా మాకు ఏమిటి ఈ కర్మ అంటూ బాధపడుతున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేసి గెలిపించామా అని బాధపడుతున్నారు. చీకటి జీవోను విడుదల చేసి ప్రతిపక్ష నాయకులు విూద కక్ష తీర్చుకొనేందుకు ఇలాంటివి చేస్తున్నారు. 1861పోలీస్‌ యాక్ట్‌ పేరుతో జీవో నెంబర్‌1 తెచ్చి ఆనందం పొందుతున్నారు. రాష్ట్రంలో11మంది టీడీపీ కార్యకర్తలు మరణానికి కారణం వైసీపీ అసమర్ధ పాలననే. తక్షణమే జీవో నెం1  ఉపసంహరంచేసుకోవాలి. అంబేద్కర్‌ సాక్షిగా నీ పతనం మొదలయింది. కుట్ర ప్రకారం చంద్రబాబు పర్యటన లో అలజడి సృష్టించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నావు.  ప్రజలలో నుంచి వ్యతిరేక ఉప్పెన రాబోతుంది ఆ ఉప్పెనకు విూరు కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలో విలువలు లేకుండా ప్రజా పాలన సాగుతోందని విమర్శించారు. జగన్‌ రెడ్డి దోపిడీలు, నవమోసాలు, నేరాల్ని కప్పిపుచ్చే కుట్ర జిఓ నెం.1. రోడ్డుషోలు, సభల ద్వారా పెంచిన పన్నులు, చార్జీలు, దోపిడీలు, నవమోసాలు బయటపడతాయన భయంతో జిఓఆర్టీ`01ను జగన్‌ రెడ్డి తీసుకొచ్చారు. ప్రజల ధన,మాన, ప్రాణాలకు రక్షణలేకుండా పోయింది. లాండ్‌,శ్యాండ్‌,వైన్‌, మైన్‌, డ్రగ్స్‌,రెడ్‌ శాండల్‌ లో లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు. నవరత్నాలు నవమోసాలయ్యాయి. ఇందుచేత రాష్ట్రాన్ని కాపాడగలిగేది చంద్రబాబు నేనని ఆయన రోడ్డు షోలకు ప్రజలు స్వచ్చందంగా, తండోపతండాలుగా వస్తున్నారని అన్నారు.
జగన్‌ రెడ్డి బలవంతపు సభలు వెలవెలబోతున్నాయి. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షోలకు బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత చట్టప్రకారం జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నది. జగన్‌ రెడ్డి, వారి తల్లి, చెల్లి, తండ్రి పాదయాత్రలకు చంద్రబాబు ప్రభుత్వం భద్రత కల్పించిందని అన్నారు.
జగన్‌ రెడ్డి పాదయాత్రల్లో 8మంది చనిపోయినా వారి పాదయాత్రలను చంద్రబాబు ప్రభుత్వం నిలుపుదల చేస్తూ అక్రమ జిఓలు జారీచేయలేదు. జి.ఓ.నెం.1 జారీచేశారంటే జగన్‌ రెడ్డికి ప్రజాస్వామ్యంపైన, ప్రజలపైన నమ్మకం లేదని రుజువు అవుతున్నది. స్టేట్‌ టెర్రరిజం అమలుచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. 1861 చట్టం వచ్చిన తర్వాత కూడా 1930లో గాంధీజీ దండియాత్ర చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా గాంధీజీ దండియాత్రను నిలుపుదల చేయలేదు. జీఓ 1 లో  చెబుతున్న పోలీసుయాక్ట్‌  1861 లో వచ్చింది. జగన్‌ రెడ్డి బ్రిటిష్‌ ప్రభుత్వం కన్నా దుర్మార్గంగా కుప్పంలో ప్రతిపక్షనేత రోడ్డుషోను అడ్డుకున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కుప్పంలో రచ్చబండ గ్రామసభ నిమిత్తం వేసిన వేదికను పోలీసులతో తొలగించడం పోలీసుశాఖకు అవమానకరమని అన్నారు.

ఇప్పటివరకు జగన్‌ రెడ్డి పరదాలు, బారికేడ్లు, ఇనుపకడ్డీలు, పోలీసు వలయం మధ్య దాక్కుంటున్నాడనుకున్నాం. నేడు ఇంకా బరితెగించి జిఓల చాటున జగన్‌ రెడ్డి  దాక్కుంటున్నాడంటే జగన్‌ రెడ్డికి ఓటమి భయం తారాస్థాయికి చేరింది. బుద్దిచెప్పిన వాడే గడ్డితిన్నాడనే సామెతలా జగన్‌ రెడ్డి తీరు కన్పిస్తోందని దుయ్యబట్టారు.
సభలు, ర్యాలీలు పెట్టకూడదంటూ జిఓ ఇచ్చిన వెంటనే రాజమండ్రిలో పెద్దఎత్తున ర్యాలీలు, సభలు ఏర్పాటుచేయడం నియంత విధానానికి నిలువుటద్దం. అలాగే నిన్న విజయనగరంలో వైకాపా నేతలు పెద్దప్రదర్శనలు చేశారు. ప్రభుత్వానికి ఒకవిధంగా, ప్రతిపక్షాలకు ఒకవిధంగా వ్యవహరించడం వివక్ష కాదా? జగన్‌ రెడ్డి హిట్లర్‌, ముస్కోలినీ, బ్రిటిష్‌ వారి నిరంకుశత్వ పాలనను మరిపించేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
ఆర్టికల్‌ 19కి జీవో 01 విరుద్ధం. వాక్‌ స్వాతంత్రపు హక్కు భావవ్యక్తీకరణ స్వాతంత్రం. నువ్వు నీ తండ్రి ఎక్కడ తిరిగి ఏం అయ్యారు. జగన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా స్వేచ్ఛగా 3,648 కిలోవిూటర్లు 341 రోజులు పాదయాత్ర చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రతను కల్పించింది అది చంద్రబాబు ప్రభుత్వం గొప్పతనం. జగన్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా రోడ్లపై ర్యాలీలు రోడ్‌ షోలు, బహిరంగ సభలు, పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి కాలంలోనూ వైఎస్సార్‌ కు భద్రతనిచ్చి చంద్రబాబు ప్రభుత్వం తన ఉదాసీనతను చాటుకుంది. జగన్‌ సభలు, పాదయాత్రకు టిడిపి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే జగన్‌ రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేవారా? కానీ జగన్‌ రెడ్డి తన పాలనలో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పాతరేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్షాలపై నిర్బంధాలు, అరెస్టులు అక్రమ కేసులు, పాదయాత్రలు, ర్యాలీలపై నిషేధాలు విధిస్తూ నియంతల ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే అంతిమ తీర్పునిస్తారు. నియంత పాలకులను ఇంటికి పంపుతారని అన్నారు.