గొట్టిపాటిని అభినందించిన ఏపీయూడబ్ల్యూజే బృందం...

గొట్టిపాటిని అభినందించిన ఏపీయూడబ్ల్యూజే బృందం...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సోమవారం నాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు  గొట్టిపాటి రవికుమార్ ను, మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును కలిసి అభినందనలు తెలిపింది.

 బాపట్ల జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చెన్నుపాటి రాంబాబు ప్రధాన కార్యదర్శి గొర్ల శ్రీనివాసరావు నాయకత్వంలో మంత్రిని, ఎమ్మెల్యేను ప్రతినిధి బృందంలో  ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఘట్టమనేని సురేష్, ఉపాధ్యక్షులు ధర్మవరపు దుర్గాప్రసాద్ కోశాధికారి మందాడి నరసింహారావు, సిహెచ్ శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు బి కృష్ణారెడ్డి, గణేష్, రెడ్డి సుబ్బారావు, కంచర్ల సుబ్బారావు, మొగిలి సుబ్బారావు, షేక్ నాగూర్ వలి, బాలాంజనేయులు, వెంగళ రెడ్డి, ఖాదర్ మస్తాన్, కృష్ణ తదితరులు ఉన్నారు.