సేవా మూర్తికి... డాక్టరేట్ 

సేవా మూర్తికి... డాక్టరేట్ 
  • ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజుకు డాక్టరేట్ ప్రధానం

తుంగతుర్తి ముద్ర:-ఈ భూమిపైన భయంకరమైన మొదటి శత్రువు ఆకలి. ఆకలి చావులకు అడ్డుకట్ట పడాలి.. పేదరికం నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి ఆరాధ్య ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు అభాగ్యులకు నేనున్నానంటూ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నిస్వార్ధమైన సేవలే తమ లక్ష్యంగా ముందుకు వెళుతుంది ఆరాధ్య ఫౌండేషన్. అలాంటి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి న్యూ మాక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ శనివారం హైదరాబాదులో వాణి శ్రీకాంత్ రాజుకు కౌన్సిల్ జనరల్ ఆఫ్ టర్కీయల్మాన్ ఓర్హన్ ఓఖాన్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.దీంతో పలువురు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు, మేధావులు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ... ఈ డాక్టరేట్ ని అందుకోవడం వల్ల సమాజం పట్ల తనకున్న బాధ్యత మరి కాస్త పెరిగిందని మున్ముందు కూడా సమాజ అభ్యున్నతి ప్రజాసేవ దిశగా తన ప్రయాణం ఉంటుందని అన్నారు. అలాగే యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తనకి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ మండల అధ్యక్షులు అంబటి రాములు, నియోజకవర్గ నాయకులు జైపాల్ నాయక్ మాట్లాడుతూ... ఈ సమాజంలో పేదరిక నిర్మూలన చేయాలనే ఒక సంకల్పంతో తనకు ఉన్న దానిలో కొంతమేర పేద ప్రజలకు వెచ్చించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి సేవ చేస్తున్న ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజు సేవలను గుర్తించి ఆవిడని గొప్ప మానవతావాదిగా పేర్కొంటూ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం ఈ నియోజకవర్గ ప్రజలకు, సంస్థకు ఎంతో గర్వకారణం అని అన్నారు. పేద కుటుంబాల శ్రేయస్సు కోసం మహిళా సాధికారత దిశగా చేసిన ప్రయత్నాలకు వెనుకబడిన వర్గాల అభ్యున్నతకై చేసిన కృషికి గాను ఈ డాక్టర్ రేట్ వచ్చినట్టు భావిస్తున్నామని అన్నారు.