సూర్యాపేట బస్టాండ్ లో ప్రమాదం.

సూర్యాపేట బస్టాండ్ లో ప్రమాదం.
  • బస్సు దిగుతూ వెనుక టైరు క్రింద పడ్డ ప్రయాణికుడు.
  • ప్రయాణికుని కాలుపైనుండి వెళ్లిన RTC బస్సు.
  • పరిస్తితి విషమం. క్షతగాత్రున్ని ఆసుపత్రికి పంపించిన స్థానికులు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- గురువారం కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ   బస్సు ప్రయాణికులని ఎక్కించుకొని సూర్యాపేట బస్టాండ్ నుండి కోదాడ బయలుదేరిన కొద్దిసేపటికే ఒక ప్రయాణికుడు బస్సు దిగుతూ కిందపడగా అతని కాలుపైనుండి వెనుక టైర్ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయింది. వెంటనే స్థానికులు గమనించి అతన్ని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.