మహిళ హత్యకేసులో నిందితుల రిమాండ్

మహిళ హత్యకేసులో నిందితుల రిమాండ్

ముద్ర, పానుగల్(ఆగస్టు30): పానగల్ మండల కేంద్రానికి చెందిన సుందరమ్మ(68) అనే మహిళ హత్యకేసులో నిందితులను రిమాండ్ కు పంపినట్లు సిఐ మహేశ్వర్ రావు తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం పానుగల్ గ్రామానికి చెందిన సుందరమ్మ అనే మహిళ ఈ నెల 23న అదృశ్యమైనట్లు ఆమే భర్త బాలకృష్ణ రావు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈనెల 28వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో రాజనగరం బావిలో మహిళ మృతదేహం లభ్యం కావడం జరిగిందని, లభ్యమైన మహిళా మృతుదేహాన్ని పానగల్ లో అదృశ్యమైన సుందరమ్మ కుటుంబ సభ్యులకు చూపించగా కుటుంభ సభ్యులు మృతదేహం సుందరమ్మదిగా గుర్తించారున్నారు.తమిళనాడుకు చెందిన సొంగల వ్యాపారం చేసుకునే ఒక కుటుంబం పానుగల్ లో కొన్ని నెలలుగా జీవనం కొనసాగిస్తున్నారు.

వీరిని అనుమతులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మృతురాలు సుందరమ్మ దగ్గర తీసుకున్న రూ.60వేల తో పాటు ఆమె మెడలో ఉన్న నగలను దొంగిలించాలని పథకం పన్నారన్నారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 10.30గంటలకు అప్పు డబ్బులు అడగడానికి ఇంటికి వచ్చిన సుందరమ్మ ను అనుకున్న పతకం ప్రకారం గొంతు నులిమి చంపి బంగారు నగలను కాజేసి మృతదేహాన్ని ఓమిని వాహనంలో వనపర్తి సమీపంలోని రాజనగరం బావిలో పడేశారని తెలిపారు. తమిళనాడుకు చెందిన సొంగల వ్యాపారులు మరియామాల్, ధర్మ రాజు, విజయ రామ రాజ్, కోటై స్వామి, భూమిక లు హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నేరాన్ని ఒప్పుకోవటంతో ఐదుగురు పై కేసు నమోదు చేసి విజయరామరాజు మినహా నలుగురి నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ తెలిపారు. పరారిలో ఉన్న విజయరామరాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సిఐ తెలిపారు.