ఐకెపి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ఐకెపి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: జిల్లాలోని రత్నాపూర్ గ్రామంలో ఐకెపి  నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 10 లక్షల క్వింటాలు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు తెలిపారు. ప్రతిరోజు సుమారు ఒక లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. 9 లక్షల కింట్రాల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు.

ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఒక లక్ష క్వింటాల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వర్షాల కారణంగా రవాణాకు కొంతవరకు ఆలస్యం అవుతుందని ఆదనపు కలెక్టర్ మోహన్ రావు తెలియజేశారు. ఇప్పటివరకు రైతుల నుండి 204 కోట్ల రూపాయల  ధాన్యాన్ని  కొనుగోలు చేయడం జరిగిందని 64 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు.  రైతులు అధైర్య పడవద్దని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకన్న సిబ్బంది పాల్గొన్నారు