అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ముద్ర,వీపనగండ్ల:- వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.అనంతరం ఇబ్బందికరంగా ఉన్న తాసిల్దార్ కార్యాలయం భవనాన్ని మరో భవనం లోకి మార్చటానికి గ్రామంలోని ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. బీసీ బాలురసతి గృహం, బీసీ పాఠశాల, మండల పరిషత్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు ప్రైవేట్ బిల్డింగును పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోడుగు రాజు, చిన్న రాంబాబు తదితరులు ఉన్నారు.