రవిశంర్ ఆధ్వర్యంలో చేరికలు...

రవిశంర్ ఆధ్వర్యంలో చేరికలు...

ముద్ర, మల్యాల:మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన వంద మంది కి పైగా బీజేపీ, కాంగ్రెస్ యూత్ సభ్యులు ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవి శంకర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు. అనంతరం వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలోకి వలసల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, మానాల గ్రామ సర్పంచ్ లక్ష్మిబుచ్చయ్య, ఉప సర్పంచ్ ఎదిపెల్లి రాజయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు నలువల సంజీవ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.